calender_icon.png 12 January, 2025 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను చాటిచెప్పిన మహానీయుడు వివేకానందుడు

12-01-2025 04:37:39 PM

మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాదేవి...

మంథని (విజయక్రాంతి): ప్రపంచంలో భారతదేశ ఔన్నత్వాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పిన మహానీయుడు స్వామి వివేకానందుడు అని, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాదేవి అన్నారు. ఆదివారం ఆయన జయంతి సందర్భంగా మంథని మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ ఆ మహనీయుని చిత్రపటానికి కౌన్సిలర్లతో కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత వల్లే భారతదేశం శక్తివంతమైన దేశంగా ఎదిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీపతి బాణయ్య, కౌన్సిలర్స్ నక్క నాగేంద్ర శంకర్, కొట్టె పద్మ-రమేష్, వికె రవి, వేముల లక్ష్మి-సమ్మయ్య మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.