కామారెడ్డి (విజయక్రాంతి): యువతకు దిశానిర్దేశం వివేకానందుడు అని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(MLA Katipalli Venkataramana Reddy) అన్నారు. ఆదివారం కామారెడ్డి మున్సిపల్ ఎదుట స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధానకార్యదర్శి నరేందర్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, పట్టణ అధ్యక్షుడు భారత్, మున్సిపల్ ప్లోర్ లీడర్ శ్రీకాంత్, కౌన్సిలర్ నరేందర్, సంతోష్ రెడ్డి, వేణు, రాజు, ప్రతాప్ పాల్గొన్నారు.