22-03-2025 10:34:13 PM
మందమర్రి (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మండల అధ్యక్షులు కొట్టే శ్రీనివాస్ ను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. పట్టణంలోని మూడవ జోన్ లోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడవద్దని తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు సంగి సంతోష్, గుడ్ల రమేష్, పైడిమళ్ళ నర్సింగ్, రాకం సంతోష్, తిరుపతి యాదవ్ లు పాల్గొన్నారు.