calender_icon.png 2 November, 2024 | 10:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివేక్ దేవరాయ్ కన్నుమూత

02-11-2024 12:23:12 AM

తుదిశ్వాస విడిచిన ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్

న్యూఢిల్లీ, నవంబర్ 1: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి చైర్మన్, ప్రముఖ ఆర్థికవేత్త వివేక్ దేవరాయ్(69) శుక్రవారం కన్నుమూశారు. పేగు సంబంధిత సమస్యతో దేవరాయ్ మృతి చెందినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన బిబేక్ దేబ్రోయ్.. ఉపాధ్యాయుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు.

అర్థశా్రస్త్రంలో ఆయ న చేసిన పరిశోధనలు, రచనలు ఎంతో గుర్తిం పు తీసుకొచ్చాయి. తదనంతరం అంచెలంచెలుగా ఎదిగి పుణెలోని గోఖలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్‌కు చాన్స్‌లర్‌గా పనిచేశారు. తదనం తరం నీతి ఆయోగ్ సభ్యుడిగానూ పనిచేశారు. ఆయన మరణం పట్ల ప్రధాని నరేం ద్ర మోదీ సంతాపం తెలిపారు.

ఈ సందర్భంగా ఎక్స్‌లో మోదీ ఓ పోస్ట్ చేశారు. ‘డాక్టర్ వివేక్ దేవరాయ్ జీ ఒక ఉన్నతమైన పండితుడు.. అర్థశాస్త్రం, చరిత్ర, సంస్కృతి, రాజకీ యాలు, ఆధ్యాత్మికత ఒకటేమిటి.. విభిన్న రంగాలలో ఆయనకు మంచి ప్రావీ ణ్యం ఉంది. తన రచనల ద్వారా భారత మేధో దృశ్యంలో చెరగని ముద్ర వేశారు’ అని ప్రధాని ట్వీట్ చేశారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు.