06-04-2025 12:00:00 AM
విటమిన్ ‘ఇ’ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల చర్మానికి తేమ అంది తాజాగా మెరుస్తూ ఉంటుంది. యూవీ కిరణాల నుంచి కూడా సంరక్షిస్తుంది. మరి ఇ విటమిన్ లభించే ఆహారం ఏంటో తెలుసుకుందాం..
* అవకాడోలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. చర్మానికి తేమ అందించి.. మృతకణాలను తొలగించి సహజంగా మెరిసేలా చేస్తుంది.
* రోజూ ఓ పిడికెడు నానబెట్టినన బాదం తీసుకోవాలి. బాదంలో విటమిన్ ‘ఇ’ అధిక మోతాదులో ఉంటుంది. యూవీ కిరణాల నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది.
* ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి చర్మాన్ని తాజాగా మెరిసేలా చేయడం లో పొద్దుతిరుగుడు గింజలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
* పాలకూర వంటి ఆకుకూరల్లో ఐరన్ కంటెంట్‌తో పాటు విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల చర్మంతో పాటు జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
* బ్రోకలీలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. తరచూ తీసుకుంటే.. చర్మంపై మృతకణాలు తొలగిపోయి.. చర్మం తాజాగా, ఆరోగ్యంగా మెరుస్తుంది.
* సీఫుడ్ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిలో ఉండే ఇ విటమిన్ చర్మాన్ని సంరక్షిస్తుంది. కురులను ఆరోగ్యంగా, దృఢంగా చేస్తుంది.
* బొప్పాయి పండులో విటమిన్ ఎ తో పాటు ఇ కూడా పుష్కలం. తరచూ తినడం వల్ల చర్మం తాజాగా, ఆరోగ్యంగా మెరిసిపోతుంది. ఎనీమియా సమస్యనూ అదుపులోకి తీసుకొస్తుంది.
* కివీ పండ్లలో అధికంగా ఉండే సి, ఇ విటమిన్ల ద్వారా రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. దాంతో పాటు శరీరానికి సరిపడా తేమ అంది చర్మం ప్రకాశిస్తుంది.