మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్ మూవీ ‘విశ్వంభర’. వచ్చే సంక్రాంతి బరిలో నిలువనున్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటూ షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ స్థాయి చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం క్లుమైక్స్ దశకు చేరుకుంది. ఇండియాలో మంచి యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పేరున్న అన్ల్ అరసు యాక్షన్ డిజైన్ చేశారని, క్లుమైక్స్ సీక్వెన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండబోతోందని చిత్రబృందం చెబుతోంది. వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలు పోషిస్తుండగా, కునాల్ కపూర్ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తుండగా, చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. 2025 జనవరి 10న విడుదల కానుందీ చిత్రం.