calender_icon.png 16 January, 2025 | 6:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నుమాయిష్‌కు సందర్శకుల తాకిడి

16-01-2025 03:30:30 AM

* వరుస సెలవుల నేపథ్యంలో పెరిగిన రద్దీ

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 15 (విజయక్రాంతి): నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌం  జరుగుతున్న 84వ ఆల్ ఇండియా ఇంటస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్) 2025కు సందర్శకుల తాకిడి పెరిగింది. సంక్రాంతి సెలవులు కలిసిరావడంతో పిల్లాపాపలతో ప్రజలు నుమాయిష్‌ను వీక్షించేందుకు భారీగా తరలివస్తున్నారు.

ఈనెల 3న ప్రారంభమైన నుమాయిష్‌కు ఇప్పటివరకు దాదాపు 4.5 లక్షల మంది సందర్శించినట్లు అధికారిక సమాచారం. ఆరంభం నుంచి ప్రతిరోజు దాదాపు 20వేల మంది సందర్శుకులు ఎగ్జిబిషన్‌కు వస్తుండగా సంక్రాంతి సెలవుల నేపథ్యంలో సందర్శకుల సంఖ్య పెరుగుతోంది.

బుధవారం ఒక్కరోజే 50 మంది సందర్శకులు నుమాయిష్‌కు వచ్చారు. హైదరాబాద్ సౌత్‌జోన్ డీసీపీ ఆక్షాన్ష్ యాదవ్, అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్, బేగంబజార్ సీఐ జి.విజయ్‌కుమార్ పర్యవేక్షణలో దాదాపు 350 మంది పోలీసులు, 2 షీటీమ్స్‌తో బందోబస్తు నిర్వహిస్తున్నారు.