ఎనుముల తిరుపతి రెడ్డి
శ్రీరంగాపూర్; జనవరి 13: శ్రీరంగాపురం మండల కేంద్రంలోని శ్రీ రంగనాయక స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తిరుపతి రెడ్డికి సకల మర్యాదలతో స్వాగతం పలకడం జరిగింది.
ఎనుముల తిరుపతి రెడ్డి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తెలంగాణ రాష్ర్ట యావత్ ప్రజానీకానికి సకల భోగభాగ్యాలను, సుఖ సంతోషాలను కలిగించాలని ఆ రంగనాయక స్వామి ని తిరుపతి రెడ్డి కోరడం జరిగింది.
శ్రీ రంగనాయక స్వామి దర్శనం కోసం విచ్చేసిన ఎనుముల తిరుపతి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేసిన శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ హరి రాజు మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.