06-03-2025 12:57:37 AM
ఖమ్మం, మార్చి 5 (విజయక్రాంతి ): మధిర మండలం జాలిముడి ప్రాజెక్టును మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు నే త్రుత్వంలోని బీఆర్‌ఎస్ బృందం బుధవారం సందర్శించి, పరిశీలించింది.చుట్టుపక్కల గ్రామాల రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని పార్టీ నాయకులు, రైతులతో కలిసి ప్రాజెక్టును సందర్శించి, సమస్యను అడిగి తెలుసు కున్నారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ ప్రాజెక్టు పిల్లర్లు కృంగిపోయాయని, ప్రాజెక్టు కాలువలు కొట్టుకుపోతే రైతులు ప్లాస్టిక్ పైపులు వేసుకొని నీళ్లు నడుపుకోవాల్సిన దుస్థితి వచ్చిందని అన్నారు.కోట్ల రూపాయల ఖర్చుపెట్టిన రైతుల పాట్లు తీరలేదని అన్నారు.తక్షణమే అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు.
కార్యక్రమంలో మాజీ ఏఎంసి చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు,పార్టీ మండల మధిర టౌన్ సెక్రటరీలు బొగ్గుల భాస్కర్ రెడ్డి, అరిగే శ్రీనివాసరావు మాజీ సర్పంచ్లు మార్త నరసింహారావు కనకుపూడి పెద్ద బుచ్చయ్య మాజీ రైతు సమన్వయ సమితి చావా వేణు బాబు మాజీ కౌన్సిలర్ యన్నంశెట్టి అప్పారావు మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కటికల సత్యనారాయణ రెడ్డి,
కర్నాటి శ్రీనివాస రావు, బొగ్గుల వీరారెడ్డి,కోన నరేందర్ రెడ్డి,ఐలూరి ఉమామహేశ్వర్ రెడ్డి, ఆళ్ల నాగబాబు, జీడిమెట్ల కృష్ణ ఐలూరి వీరారెడ్డి,ఐలూరి నర్సిరెడ్డి పంతంగి రాంబాబు, కొంగర రంగయ్య, కొంగర విశ్వేశ్వరరావు,బాదినేని అంజయ్య,బాదినేని వెంకట్రామయ్య,వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చిధిరాల రాంబాబు, నాగులవంచ రామారావు, తదితరులు పాల్గొన్నారు.