22-03-2025 01:20:01 AM
మహబూబ్ నగర్, మార్చి 21 ( విజయక్రాంతి) :రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ, చైర్మన్ కం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, జిల్లా కార్యదర్శి డి. ఇందిరా శుక్రవారం జిల్లా కేంద్రం లోని జిల్లా జైలు ను సందర్శించినారు. జిల్లా జైలు లో అన్నీ వసతులు, సదుపాయాలు సరిగా అందుతు న్నా యా లేవా అక్కడి అధికారులు అడిగి తెలుసుకున్నారు అనంతరం జైలు లోని బ్యారక్ ల వద్దకు వెళ్లి అక్కడ ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు బెయిల్ కొరకు లీగల్ ఎయిడ్ అడ్వకేట్ కావాలంటే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, మహబూబ్ నగర్ ను సంప్రదించి న్యాయ సహాయం పొందవచ్చనన్నారు. . ఖైదీలకు పలు సలహాలు,సూచనలు ఇచ్చారు.