calender_icon.png 26 November, 2024 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూతపడ్డ స్కూళ్ల సందర్శన

26-11-2024 01:10:56 AM

నాగల్‌గిద్ద, నవంబర్ 25: నాలుగేళ్లుగా పాఠశాల తెరుచుకోవ డం లేదని దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఈ నెల 22న విజయక్రాంతి కథనాన్ని ప్రచురించింది. దీంతో మండల విద్యాధికారులు స్పందించారు.  ఎంఈవో ఆదే శాల మేరకు కాంప్లెక్స్ హెచ్‌ఎం హిరామన్, సీఆర్‌పీ రవికుమార్ సోమవారం సందర్శిం చి లక్యానాయక్ తండా, పత్తు తండాలలోని స్కూళ్లను సందర్శించి విద్యార్థుల వివరాలు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించారు.

అనంతరం వారు మాట్లాడుతూ తండాలో తక్కువ మంది విద్యార్థులు ఉండ టం వల్ల పక్క తండాకు విద్యార్థులను షిఫ్ట్ చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు పూర్తిస్థాయిలో ఉంటే పాఠశాల తెరవడానికి చర్యలు తీసుకుంటామని, ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదిక పంపామన్నారు.

సక్రునాయక్ స్కూల్‌లో ఎమ్మెల్యే తనిఖీ

నాగల్‌గిద్ద మండలంలోని సక్రునాయక్ పాఠశాలను ఎమ్మెల్యే సంజీవరెడ్డి తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల పనితీరు, బోధనలో నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో పెంటకుప్పలు ఉండటంతో కార్యదర్శికి ఫోన్ చేసి వాటిని తొలగించాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని నిర్వాహకులకకు చెప్పారు.