calender_icon.png 14 January, 2025 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్వవేదికపె ఫ్యూచర్‌సిటీ

14-01-2025 02:30:39 AM

పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం

  1. తొలి ఏడాదే భారీగా పెట్టుబడులు రాక 
  2. స్పష్టంచేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 
  3. సీఎం దావోస్ టూర్ నేపథ్యంలో మంత్రి శ్రీధర్‌బాబుతో సమాలోచనలు
  4. ఈ నెల16 నుంచి 19 వరకు సింగపూర్.. 20 నుంచి 22 వరకు దావోస్‌లో పర్యటన

హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): ఫ్యూచర్ సిటీగా వెలుగొందు తున్న హైదరాబాద్‌లో పెట్టుబడులకు ఉన్న సానుకూలతలను దావోస్‌లో ప్రపంచ వేదికపై పరిచయం చేద్దామని, ఇందుకోసం అధికారులు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నా రు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి పరిశ్రమల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించా రు.

జనవరి 20 నుంచి దావోస్ పర్యటన నేపథ్యంలో రాష్ర్టంలో పెట్టుబడుల సమీకరణ, వాటి పురోగతిపై అధికారులతో సమాలోచనలు చేశారు. గతేడాది ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఏయే కంపెనీలు రాష్ర్టంలో కార్యకలాపాలను ప్రారంభించాయి? అవి ఏయే దశలో ఉన్నాయో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం అందరినీ ఆకర్షిస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు.

తొలి ఏడాదిలోనే రాష్ర్ట ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివద్ధి పనులన్నీ తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టినట్టు చెప్పారు. దేశంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నట్టు సీఎం వివరించారు. దేశ విదేశాల్లో పేరొందిన కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ర్టంలో అనుకూలమైన వాతావరణముందని అభిప్రాయపడ్డారు.  

పెట్టుబడులపై సీఎం సంతృప్తి

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రా ష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని సీఎం పేర్కొన్నారు. వచ్చిన పెట్టుబడులపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గతేడాది దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో చేసుకున్న ఒప్పం దాల గురించి అధికారులు సీఎంకు వివరించారు. గతేడాది రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 14 ప్రముఖ కంపెనీలు రాష్ర్టంలో పెట్టుబడులకు ముందుకు వచ్చినట్టు చెప్పారు.

దాదాపు 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరాయని, వీటిలో దాదాపు 17 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని చెప్పా రు. ఇందులో పది ప్రాజెక్టులు వివిధ దశ ల్లో వేగం పుంజుకున్నాయని, ఏడు ప్రాజెక్టుల అమలు ప్రారంభ దశలో ఉన్నట్టు చెప్పా రు. ఈ సందర్భంగా కంపెనీల వారీగా పురోగతిని మంత్రి శ్రీధర్‌బాబుతో సీఎం చర్చించారు. 

16 నుంచి సీఎం విదేశీ టూర్

ఈ నెల 16 నుంచి 19 వరకు సింగపూ ర్, 20 నుంచి 22 వరకు సీఎం దావోస్‌లో పర్యటించనున్నారు. సీఎంతోపాటు మం త్రి శ్రీధర్‌బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ పర్యటనలో ఉంటారు. సింగ పూర్‌లో స్కిల్ యానివర్సిటీతో ఒప్పందాలతోపాటు ఇతర పెట్టుబడుల కోసం సంప్రదింపులు జరుపుతారు. అనంతరం దావోస్‌లో సదస్సులో పాల్గొంటారు.

ఈ ఆరు రోజుల పర్యటన షెడ్యూల్‌తోపాటు అక్కడ జరిగే సదస్సులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశాల ప్రణాళికను అధికారులు సీఎంకు వివరించారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, ఇతర ఉన్నతా ధికారులు పాల్గొన్నారు.