మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట మల్లిడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీ చిత్రంగా రూపుదిద్దుకుంటు న్న ఈ మూవీని యూవీ క్రియేష న్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశ కు వచ్చేసింది. అయితే సంక్రాంతి కాను కగా ఈ సినిమాను విడుదల చేయాలని ముందుగా మేకర్స్ భావించారు. కానీ ‘గేమ్ ఛేంజ ర్’ కోసం వాయిదా వేసిన విష యం తెలిసిందే. ఆ తరువాత సినిమా విడుదల తేదీపై ఎలాంటి ప్రకటనా రాలేదు.
దీంతో ఈ సినిమా విడుదల తేదీ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా రు. ఈ క్రమంలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయమై ఆసక్తికర ప్రచారం జరుగుతోందిప్పుడు. చిరు చిత్రం ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ విడుదలైన తేదీనే ‘విశ్వంభర’ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మే 9న ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ విడుదలై, అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు ‘విశ్వంభర’ అదే జానర్‌లో వస్తోంది కాబట్టి సెంటిమెంట్‌గా దీన్ని సైతం మే 9నే విడుదల చేస్తారని చెప్పుకుంటున్నారు. కొద్ది రోజులు ఆగితే కానీ ఈ విడుదల తేదీపై జరుగుతున్న ప్రచారం ఎంతమేర నిజమనేది తెలియదు.