calender_icon.png 27 October, 2024 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లేడీ గెటప్‌లో విశ్వక్‌సేన్

04-07-2024 12:05:00 AM

డిఫరెంట్ జానర్ చిత్రాలతో అలరిస్తున్న విశ్వక్‌సేన్ తన తర్వాతి చిత్రం విషయంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాలో లేడీ గెటప్‌లో కనిపించనున్నారాయన. లేడీ క్యారెక్టర్ చేయడానికి కొంచెం ఆలోచించనిదే నిర్ణయం తీసుకోలేని ఈ తరం హీరోల తీరుకు భిన్నంగా తాజా చిత్రం ‘లైలా’లో విశ్వక్‌సేన్ మెన్‌గానూ, ఉమెన్‌గానూ కనిపించనున్నారు. ‘లైలా’ సినిమాను మేకర్స్ బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.

హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన ముహూర్తపు కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు కె.రాఘవేందర్‌రావు, హరీశ్ శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి రాఘవేందర్‌రావు క్లాప్‌నివ్వగా, హరీశ్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్క్రిప్టును నిర్మాతలు వెంటక సతీశ్ కిలారు, జెమినీ కిరణ్ చిత్ర బృందానికి అందజేశారు. అనంతరం ఇదే కార్యక్రమంలో ‘లైలా’ ఐ లుక్‌ను విడుదల చేశారు.

లైలాగా విశ్వక్‌సేన్ ఛార్మింగ్ లుక్ ఆకట్టుకుంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా షైన్ స్క్రీన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కిస్తుండగా, సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆకాంక్ష శర్మ ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమవుతోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా 2025, ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు రచన: వాసుదేవమూర్తి; సంగీతం: తనిష్క్ బాగ్చి, జిబ్రాన్; సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్; ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి; ఎడిటర్: అన్వర్ అలీ.