10-02-2025 04:26:50 PM
లైలా సినిమా ప్రమోషన్(Laila movie promotion)లో నటుడు పృథ్వీ వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. మేం ఈవెంట్ లో లేనప్పుడు పృథ్వీ మాట్లాడారని వివరించారు. పృథ్వీ చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెబుతున్నారని విశ్వక్ సేన్(Vishwak Sen) పేర్కొన్నారు.
పృథ్వీ వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదని తెలిపారు. పృథ్వీ చెప్పినట్లు సినిమాలో అన్ని మేకలు లేవన్నారు. పృథ్వీకి తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. పృథ్వీ సినిమాలో నటుడు మాత్రమేనని విశ్వక్ సేన్ వెల్లడించారు. బాయ్ కాట్ లైలా(Laila movie) పేరుతో 22 వేల ట్వీట్లు వేశారని చెప్పిన ఆయన రిలీజ్ రోజే హెచ్ డీ ప్రింట్ తెస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. నాతో ఏం శత్రుత్వం ఉంది.. ఏం అన్యాయం చేశాను? అని ప్రశ్నించారు. ఎవరో చేసిన తప్పుకు మా సినిమాను బలి చేయొద్దని కోరారు.