calender_icon.png 27 January, 2025 | 10:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్వక్‌సేన్ సినిమా పిచ్చోడు

24-01-2025 12:00:00 AM

విశ్వక్‌సేన్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘లైలా’. ఈ చిత్రాన్ని రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుం ది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ ‘ఇచ్చుకుందాం బేబీ’ని విడుదల చేశారు. లియోన్ జేమ్స్ స్వరపరిచిన బాణీకి పూర్ణాచారి సాహిత్యం అందించగా, ఆదిత్య ఆర్‌కే, ఎంఎం మానసి ఆలపించారు.

ఈ పాటలో హీరో విశ్వక్‌సేన్, హీరోయిన్ ఆకాంక్షశర్మల కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గురువారం ఏర్పాటుచేయగా, విశ్వక్‌సేన్ మాట్లాడుతూ.. “ప్రతి వాలెంటైన్స్ డేకి తమకు ఎవరూ లేరని సింగిల్స్ బాధపడుతుంటారు. ఈ వాలెంటైన్స్ డేకి వాళ్ల కోసం ‘లైలా’ ఉంది. అమ్మాయిలు సింగిల్ అనుకుంటే వాళ్లకు సోను మోడల్ ఉన్నా డు. (నవ్వుతూ) నా కెరీర్‌లో యాక్షన్ టచ్‌తో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ ఇదే.

నిజంగా అమ్మాయిలకు హ్యాట్సప్ చెప్పాలి.. ఎందుకంటే లైలా గెటప్ కోసం రెడీ అవ్వడానికి రెండేసి గంటలు పట్టే ది. ఫిబ్రవరి 1న రాయలసీయ మాస్ సాంగ్ ఓహో రత్తమ్మ రిలీజ్ చేస్తున్నాం. అది కూడా అదిరిపోయింది” అన్నారు.

డైరెక్టర్ రామ్ నారాయణ్ మా ట్లాడుతూ.. ‘ఇలాంటి సబ్జెక్ట్  చేయడం ఒక ఛాలెంజ్. ఈ కథ ఇద్దరు ముగ్గురు హీరోలకు చెప్పాను. లేడీ గెటప్ వేయడం అంత ఈజీ కాదు. సినిమా అంటే పిచ్చి ఉన్నోడే చేయాలి.. అలాంటి పిచ్చి ఉన్న విశ్వక్ నాకు దొరికారు. తనకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను’ అన్నారు. నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. ‘ఇది మంచి క్యారెక్టర్‌గా విశ్వక్ కెరీర్‌లో నిలిచిపోతుంది’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో లిరిక్ రైటర్ పూర్ణాచారి, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.