calender_icon.png 24 October, 2024 | 6:49 AM

35 నుంచి విశ్వదేవ్ గ్లింప్స్ రిలీజ్

21-07-2024 12:07:01 AM

నివేతా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న తాజా చిత్రం ’35 -చిన్న కథ కాదు’. నంద కిషోర్ ఈమాని దర్శకత్వంలో సురేశ్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు. చిత్రంలో విశ్వదేవ్‌ను ప్రసాద్‌గా పరిచయం చేస్తూ మేకర్స్ శనివారం ఒక స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఇందులో మధ్యతరగతి కుటుంబానికి శ్రద్ధ, బాధ్యత ఉన్న తండ్రిగా విశ్వదేవ్ నటన ఆసక్తికరంగా ఉంది. వివేక్ సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మూవీ ప్రొడక్షన్ డిజైన్ చేసింది లతా నాయుడు కాగా, టీసీ ప్రసన్న ఎడిటర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 15న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.