25-02-2025 02:35:41 AM
ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ)ను గ్రామస్థాయికి విస్తరిం పజేయా లని ఆ సంఘం అఖిల భారత సంఘటన సహ కార్యదర్శి వినాయకరావు దేశ్‌పాండే, ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్, దక్షిణ భారత సంఘటన కార్యదర్శి స్థానుమలయన్, భాగ్యనగర్ క్షేత్రకార్యదర్శి గుమ్మల్ల సత్యం, క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్యరవికుమార్ అన్నారు. వీహెచ్‌పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహమూర్తి అధ్యక్షతన రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో వీహెచ్‌పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఈ నెల 22 కొనసాగా యి.
ఈ సందర్భంగా సోమవారం వారు మాట్లాడుతూ.. హిందూ సమాజంపై కొనసాగుతున్న విద్వేషపూరిత కుట్రలను తిప్పి కొట్టేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పిల్లల పెంపకం పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిం చారు. హిందూ జనాభాను పెంచాలని, మతమార్పిడి, లవ్‌జిహాద్ అంశాలపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. సమావేశంలో వీహెచ్‌పీ నాయకులు బండారి రమేశ్, పండరినాథ్, డా.సునీతరెడ్డి, డా.రామ్‌సింగ్, భాస్కర్‌రావు, సహకార్యదర్శి తోట భానుప్రసాద్, వెంకటేశ్వరరాజు, రమేష్, పగుడాకుల బాలస్వామి, కుమారస్వామి, శివ, రాములు, పద్మశ్రీ, వాణిసక్కుబాయి పాల్గొన్నారు.