calender_icon.png 1 April, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్వహిందూ పరిషత్ అకెనపల్లి కండ కమిటీ ఎన్నిక

27-03-2025 12:42:27 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలం(Bellampalli Mandal)లోని బుచ్చయ్యపల్లి గ్రామంలో గురువారం విశ్వహిందూ పరిషత్ బెల్లంపల్లి ప్రఖండ  కార్యదర్శి మిట్ట శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఖండ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మిట్ట శ్రీనివాస్ మాట్లాడుతూ యువత దేశ భక్తి, దైవ భక్తి కలిగి హిందూత్వ పరిరక్షణకై పాటుపడాలని కోరారు.సమాజంలో హిందువుల పై దాడులు జరుగుతున్న సంఘటనలను వివరించారు. రానున్న రోజుల్లో యువకులు, ప్రజలు దేశ శ్రేయస్సు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో రాణావేన రాజు, బుడిమె విజయ్ కుమార్, రాజూరి రాజయ్య, పందిర్ల రమేష్, తోకల రమేష్,మేకల పవన్, బండ్ల పవన్, జంభోజు సాయి, అన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.