మంచిర్యాల,(విజయక్రాంతి): హైదరాబాద్ చర్లపల్లిలో జరిగిన ట్రస్మా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో మంచిర్యాల జిల్లాకు చెందిన రాపోలు విష్ణువర్ధన్ రావును ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే విధంగా మంచిర్యాల జిల్లా నుంచి కస్తూరి పద్మ చరణ్ ను రాష్ట్ర అడ్వైజర్ గా, యార్లగడ్డ బాలాజీ ని రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా, సురభి శరత్ కుమార్ ని రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా, అఖిలేందర్ సింగ్, రాం వేణు లను రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.