calender_icon.png 16 January, 2025 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ సైకాలజిస్ట్‌గా విష్ణుప్రియ

14-07-2024 12:27:41 AM

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): తెలంగాణ సైకాలజిస్ట్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇన్‌స్పైరింగ్ ఉమెన్ సైకాలజిస్ట్ అవార్డు 2024ను మహబూబ్ నగర్‌కు చెందిన డా. విష్ణుప్రియ అందుకున్నారు. శనివారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును మాజీ కేంద్ర మంత్రి ఎస్ వేణుగోపాలాచారి ఈ అవార్డును అందచేశారు. కార్యక్రమంలో జాతీయ మహిళా కమిషన్ మాజీ సలహాదారు  టీ వెంకటరత్నం, నటుడు కేవీ ప్రదీప్, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ హరిణి అట్టూరు, డాక్టర్ ఎం రాంచందర్,  తదితరులు పాల్గొన్నారు.