అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ పిక్చర్స్, ఎన్‌ఐకే స్టూడియోస్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సోమవారం ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి విచ్చేసి క్లాప్ కొట్టారు. అజయ్ భూపతి తొలిషాట్‌కి దర్శకత్వం వహించారు. భారతదేశంలో 108 విష్ణు దేవాలయాలకు సంబంధించిన నాగబంధం చుట్టూ కథ తిరుగుతుంది. ఈ చిత్రానికి అభే సంగీతం అందిస్తున్నారు. మిస్టరీ, అడ్వంచర్ జర్నీగా సినిమా రూపొందనుంది.