calender_icon.png 19 April, 2025 | 11:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తపేటలో సినీ నటి వైష్ణవి చైతన్య సందడి

14-04-2025 12:11:15 AM

విశిష్ట జ్యువెలరీస్ డైమండ్ షోరూం ప్రారంభం

ఎల్బీనగర్ జులై 13 : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కొత్తపేటలో సినీ నటి వైష్ణవి చైతన్య సందడి చేశారు. కొత్త పేట లో నూతన విశిష్ట జువెలర్స్ అండ్ డైమండ్స్ షో రూమ్ ను ఆదివారం సినీ నటి వైష్ణవి చైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా విశిష్ట జువెలర్స్ అధినేత ఆనంద్ బాబు,సినీ నటి వైష్ణవి చైతన్య  మాట్లాడుతూ.. ఎటువంటి తరుగు, మజూరి లేకుండా 24 క్యారె ట్ బంగారు ఆభరణాలు, డైమండ్ జ్యువెలరి మంచి ధరకు కస్టమర్లకు అందించేందుకు వి శిష్ట జ్యువెలర్స్ ప్రారంభించినట్లు తెలిపారు.

హైదరాబాదులో  మొదటి బ్రాంచ్ బంజారాహిల్స్‌లో ఉండగా... ఇప్పుడు రెండో బ్రాం చ్ కొత్తపేటలో ప్రారంభించడం సంతోషం గా ఉందని తెలిపారు. విశిష్ట జ్యువెలరీస్ డై మండ్ షోరూం యజమానులు పలబట్ల ఆ నంద్ బాబు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్ట ర్లు శ్రీదేవి, సుమంత్, వైష్ణవి, సింధూర తదితరులు మాట్లాడారు. విశిష్టమైన ఆఫర్లు, నెలవారీ స్కీమ్‌లు, ఆఫర్లు ఉన్నాయని, ఈ ఎంఐ సౌకర్యం కూడా ఉందని తెలిపారు. నటి వైష్ణవి చైతన్యను చూసేందుకు వచ్చిన అభిమానులతో ప్రాంతమంతా కోలాహలం గా కనిపించింది.

అభిమానులకు వైష్ణవి చేతన్య హాయ్ అంటూ ఆత్మీయంగా పలకరి స్తూ సందడి చేశారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దయా నంద్ గుప్తా, ఎల్‌వి కుమార్, టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పురం వెంకటేష్ గుప్తా, మొగుళ్లపల్లి ఉపేందర్ గు ప్తా, రిషి, కాంగ్రెస్ నేత చిలుక ఉపేందర్ రెడ్డి  పాల్గొన్నారు.