25-04-2025 12:41:17 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ పౌరుల వీసా సేవలను నిలిపివేసి న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 27లోగా పాకిస్థాన్ పౌరులంతా భారత్‌ను విడిచి పెట్టి వె ళ్లాలని విదేశాంగశాఖ ఒక ప్రకటనలో తెలిపి ంది. అయితే తాజాగా వీసాల చెల్లుబాటును మరో రెండు రోజులకు పొడిగిస్తూ ఉత్తర్వు లు జారీ చేసింది. దీంతో 29 వరకు పాక్ పౌరుల వీసాలు చెల్లుబాటు కానున్నాయి.
‘పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణ యాలకు కొనసాగింపుగా పాకిస్థాన్ జాతీయుల వీసాలను తక్షణమే నిలిపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. మొదట అనుకున్న ప్రకారం పాకిస్థాన్ పౌరులకు జారీ చేసిన వీసాలు ఈ నెల 27తో నిలిపివేయాలి. అయితే పాక్‌కు తిరిగి వెళ్లేవారి సం ఖ్యను దృష్టిలో పెట్టుకొని వీసా చెల్లుబాటు ను 29 వరకు పొడిగించాం’ అని విదేశాంగశాఖ పేర్కొంది.
పాకిస్థాన్ పౌరులు అట్టారి సరిహద్దుకు చేరుకోవడం మొదలుపెట్టారు. వారి పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వా త బీఎస్‌ఎఫ్ అధికారులు వారిని సరిహద్దు దాటేందుకు అనుమతి ఇచ్చారు. ఇప్పటివరకు 10 4 మంది పాకీస్థానీయులు తమ దేశానికి వెళ్లిపోయారు. 29 మంది భారతీయులు పాక్ నుంచి దేశానికి వచ్చారు.