25 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ రైల్వే డివిజనల్ మేనేజర్ (డీఆర్‌ఎం) సౌరభ్ ప్రసాద్ సీబీఐకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. విశాఖపట్నం రైల్వే డివిజన్ డీఆర్‌ఎంగా పనిచేస్తున్న సౌరభ్ ప్రసాద్.. ఓ కాంట్రా క్టర్ వద్ద లంచం తీసుకునేందుకు ముంబై వెళ్లారు.
కాంట్రాక్టర్ నుంచి డీఆర్‌ఎం లంచం తీసుకుంటుండగా మాటు వేసిన సీబీఐ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విశాఖ డిఆర్‌ఎం ఆఫీసులో సీబీఐ విశాఖ, ఢిల్లీ బృందాలు సో దాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ సోదాల్లో సీబీఐ అధికారులకు కీలక డాక్యుమెంట్స్ లభ్యమైనట్టు తెలిపారు. సీబీఐ అదుపులో ఉన్న సౌరభ్ ప్రసాద్‌ను అధికారులు విచారిస్తున్నారు.