calender_icon.png 9 January, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టాక్ మార్కెట్లకు వైరస్ షాక్

07-01-2025 01:08:24 AM

  • రూ.12లక్షల కోట్ల సంపద ఆవిరి..!
  • కుప్పకూలిన సూచీలు
  • సెన్సెక్స్ 1258 సాయింట్లు, నిఫ్టీ 389 పాయింట్లు పతనం

ముంబై:  దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. చైనాలో కొత్తగా వెలుగులోకి వచ్చిన హెచ్‌ఎంపీవీ వైరస్‌తో  మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు చైనాకే పరిమి తమైన కేసులు భారత్‌లోనూ నమోదయ్యా యి. కర్నాటక, గుజరాత్‌లలో కేసులు రికార్డయ్యాయి. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశీయ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి.

మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్లు భారీగా నష్టపోయాయి. పె ట్టుబడిదారులు దాదాపు రూ.12లక్షల కోట్లకుపైగా సంపదను కోల్పోయారు. క్రితం సెష న్‌తో పోలిస్తే సెన్సెక్స్.. సోమవారం ఉద యం 79,281.65 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. మధ్యాహ్నంకల్లా  సెన్సెక్స్ 1200 పాయింట్లకుపైగా పతనమైంది. ఇం ట్రాడేలో 79,532.67 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. కనిష్టంగా 77,781.62 పాయింట్లకు పడిపోయింది.

చివరకు 1,258.12 పాయింట్లు తగ్గి.. 77,964.99 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 388.70 పాయింట్లు తగ్గి.. 23,616.05 వద్ద ముగిసింది. నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో టాటా స్టీల్, ట్రెంట్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, బీపీసీఎల్ ఉన్నాయి. అయితే, అపోలో హాస్పిటల్స్, టాటా కన్స్యూమర్, టైటాన్ కంపెనీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లాభపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్ సూచీ 4శాతం పతనమైంది. మెటల్, రియాల్టీ, ఎనర్జీ, పీఎస్‌యూ, పవర్, ఆయిల్, గ్యాస్ ఒక్కొక్కటి 3 శాతం చొప్పున క్షీణించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్య్యాప్ ఇండెక్స్ 2.4 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3 శాతం పడిపోయాయి.

ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లోనే..

 చైనాలో వెలుగు చూసిన వైరస్ ప్రావం ఆసియా మారెకట్లపైనా పడింది. మరో వైపు మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలోచైనా సహా మరికొన్ని దేశాలపై టారిఫ్‌ల భయం వెంటాడుతూ ఉంది. దీంతో జపాన్ నిక్కీ, హాంకాంగ్, షాంఘై సహా ప్రధాన ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ముగిశాయి. దీని ప్రభావం మన మార్కెట్లపైనా పడింది.

మరో వైపు దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం మన మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడికి కారణమని విశ్లేషరులు అంటున్నారు. మరో వైపు డాలరుతో రూపాయి మారకం విలువ సైతం ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. సోమవారం అమెరికా కరెన్సీతో రూపాయి మారకం విలువ రూ.85.82కు పడిపోయింది.