22-04-2025 01:09:17 AM
కొండపాక, ఏప్రిల్ 21: కొండపాక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో కమిటీ పాలకవర్గం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ గా విరుపాక శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ గా బట్ట పర్శరాములు, డైరెక్టర్లుగా శివలింగ కృష్ణమూర్తి , రెడ్డమైన ర వీందర్, నాగపురి సుజాత , అంబటి రాజు, చుక్క యాదయ్య , మహమ్మద్, తాళ్లపల్లి అంజయ్య, కొమ్ము మల్లికార్జున్, శిలసాగరం శ్రీనివాస్, వడ్లకొండ రాజు, పెరుగు తిరుపతి, వడ్లకొండ శ్రీనివాస్ లు బాధ్యతలు స్వీకరించారు.
మరో నలుగురు ఎక్స్ ఆఫీసీయో సభ్యులుగా నియామకమైనట్లు తెలి పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి పరమేశ్వర్, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, నాయకులు లింగారావు, సురేందర్ రావు, వెంకట్ రెడ్డి, రెడ్డమై న రవీందర్, తుం శ్రీకాంత్ రెడ్డి, ఉపేందర్, కాంగ్రెస్ నాయకులు, పాల్గొన్నారు.