calender_icon.png 28 September, 2024 | 2:52 AM

సింగరేణి గనుల్లో వర్చువల్ రియాలిటీ సాంకేతికత

27-09-2024 01:52:35 AM

హూవర్‌డ్యామ్ స్ఫూర్తితో రక్షణ చర్యలు

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

రెండోరోజూ కొనసాగిన అమెరికా పర్యటన

హైదరాబాద్, సెప్టెంబర్ 26(విజయక్రాం తి): సింగరేణి గనుల్లో వర్చువల్ రియాలిటీ సాంకేతికతను ప్రవేశపెట్టడానికి అవకాశాలను పరిశీలించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న భట్టి విక్రమార్క ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్ బలరాం, స్పెష ల్ సెక్రెటరీ కృష్ణభాస్కర్‌తో కలిసి లాగ్‌వేగాస్‌లో నిర్వహిస్తున్న మైన్ ఎక్స్ పో 2024, హూవర్ డ్యామ్‌ను సందర్శించారు. తొలుత ఎక్స్ పోలో పలు ప్రఖ్యాత కంపెనీల స్టాల్స్ ను సందర్శించారు.

శాండ్విక్ కంపెనీ స్టాల్ లో ఏర్పాటు చేసిన అత్యాధునిక కంటిన్యూయస్ మైనర్ యంత్రాన్ని, వర్చువల్ రియా లిటీ మైనింగ్ టెక్నాలజీని స్వయంగా పరిశీలించారు. ఈ వర్చువల్ రియాలిటీ ద్వారా గని లోపల పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నందు వల్ల యంత్రాలను నడిపే ఆపరేటర్లు దీనితో మెరుగైన శిక్షణ పొందేందుకు అవకాశముంటుందని స్టాల్ నిర్వాహ కులు భట్టికి వివరించారు. వర్చువల్ రియాలిటీ సాంకేతికత హెడ్ గేర్ ధరించి డిప్యూటీ సీఎం స్వయంగా పరిశీలించారు.  ఈ తరహా సాంకేతికతను గనుల్లో ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని సింగరే ణి సీఎండీ ఎన్ బలరాంను ఆదేశించారు.

హూవర్‌డ్యామ్ స్ఫూర్తితో..

అమెరికాలోని నేవడా, అరిజోనా రాష్ట్రా ల సరిహద్దులో కొలరాడో నదిపై నిర్మించిన జలవిద్యుత్ ప్రాజెక్ట్ హూవర్ డ్యామ్ ఎంతో ఆదర్శవంతమైందని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు. ఇక్కడి నీటి వినియోగం, అమలవుతున్న రక్షణ చర్యలు ఆచరించదగినవని కొనియాడారు. స్థానిక అధికారులు భట్టి బృందానికి ప్రాజెక్టు వివరాలను వివరించా రు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న జల విద్యుత్ ఉత్పాదకత, యంత్రాల సామర్థ్యం, నీటి లభ్యత గురించి డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. హువర్ డ్యామ్‌ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలోని ప్రాజెక్టుల సామర్థ్యం పెంపుదల అవకాశాలను పరిశీలించాలని సూచించారు.