calender_icon.png 7 November, 2024 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓపెనర్‌గా కోహ్లీనే కరెక్ట్: దాదా

11-05-2024 01:52:42 AM

బెంగళూరు: పొట్టి ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా వస్తే బాగుంటుందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 17వ సీజన్‌లో అతడి ఆటతీరు చూసిన తర్వాత వరల్డ్‌కప్‌లో రోహిత్‌కు జతగా కోహ్లీనే కరెక్ట్ అని వ్యాఖ్యానించాడు. బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో దాదా మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం విరాట్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ తన స్ట్రుక్‌రేట్‌పై వస్తున్న అనుమానాలను పటాపంచలు చేశాడు. రానున్న టీ20 ప్రపంచ కప్‌లో కోహ్లీ ఓపెనర్‌గా పంపించడమే కరెక్ట్. రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌లను ధాటిగా ఆరంభించగలడు. ఐపీఎల్లో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్న కోహ్లి ఔట్‌స్టాండింగ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇక టీ20 ప్రపంచక ప్‌నకు ఎంపిక చేసిన భారత జట్టు సమతుల్యంగా ఉంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కనిపిస్తోంది. మ న జట్టుకు బుమ్రా రూపంలో బెస్ట్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. ఇంపాక్ట్ రూల్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. రానున్న ప్రపంచకప్‌లో ఆ స్థాయి స్కోర్లను చూసే అవకాశముంది’ అని అన్నాడు.