ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్
దుబాయ్: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో భారత బ్యాటర్లు సత్తా చాటారు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెండు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానంలో నిలవగా.. యువ ఓపెనర్ జైస్వాల్ ఒక స్థానం ఎగబాకి ఏడో స్థానం దక్కించుకున్నాడు. ఇక భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఒక స్థానం కోల్పోయి ఆరో ర్యాంకుకు పడిపోయాడు.
ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ తన నంబర్‌వన్ స్థానాన్ని కాపాడుకోగా.. విలియమ్సన్, డారిల్ మిచెల్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లండ్ బ్యాటర్ బ్రూక్ మూడు స్థానాలు మెరుగుపరుచుకొని నాలుగో స్థానంలో నిలిచాడు. పాక్‌పై అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ ఏడు స్థానాలు ఎగబాకి 17వ స్థానానికి చేరుకున్నాడు. కాగా టీమిండియా సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు ఆడనుంది.