11-02-2025 12:34:18 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించేం దుకు ఎలాంటి రసాయనాలు, రంగులు వినియోగించకుండా నాణ్యమైన మిరపకాయల తో విరాట్ చిల్లీ పౌడర్ ఉత్పత్తి చేయడంపై శ్రీచరణ్ కమ్యూనికేషన్స్ ఎండీ బుస్సా శ్రీనివాస్ గుప్తా హర్షం వ్యక్తంచేశారు.
ఆరిజిన్ ఫినరీ ఫుడ్స్ ఆధ్వర్యంలో ప్రారంభమైన కారం ఉత్పత్తులను బుస్సా శ్రీనివాస్ గుప్తా సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే కారంలో అనేక రకాల రంగులు, రసాయనాలు వాడటం వల్ల ప్రజలు వివిధ వ్యాధుల బారినపడుతున్నారని చెప్పారు.
ముఖ్యంగా నాణ్యమైన మిరపకాయలు వాడకపోవడం వల్లనే ఈ తరహా సమస్యలు అధికం అవుతున్నాయన్నారు. విరాట్ చిల్లీ పౌడర్‌లో ఎలాంటి రసాయనాలు కానీ, రంగులు కానీ వాడక పోవడం వల్ల కారం చాలా స్పైసీగా, రుచిగా ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 78072 34565 నంబరులో సంప్రదించాలని కోరారు.