calender_icon.png 28 December, 2024 | 8:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విరాజి టీజర్ విడుదల

11-07-2024 12:05:00 AM

వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘విరాజి’. ఆద్యాంత్ హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహా మూవీస్, ఎం3 మీడియా పతాకాలపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. ఆగస్టు 2న విడుదల కానున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్, టీజర్‌ను బుధవారం ‘బేబి’ చిత్ర దర్శకుడు సాయి రాజేశ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయి రాజేశ్ మాట్లాడుతూ.. ‘వరుణ్ సందేశ్ లుక్ అదిరిపోయింది. క్యారెక్టర్ కోసం అంత అంకితభావంతో పనిచేస్తున్న వరుణ్‌కు నా అభినందనలు. ఈ చిత్రం విజయం సాధించాలి’ అన్నారు.  ఈ సినిమాలో రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరాం, వైవా రాఘవ తదితరులు నటిస్తుండగా ఎబినేజర్ పాల్ సంగీత సహకారం అందిస్తున్నారు. జీవీ అజయ్‌కుమార్ కెమెరా మెన్‌గా పనిచేస్తున్నారు.