దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
పెద్దపెల్లి జిల్లా ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మెన్ శంకర్, సెక్రటరీ జనరల్ తూము రవీందర్ పటేల్
పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపెల్లి జిల్లా ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా అధికారులు, ఉద్యోగులపై సోమవారం జరిగిన దాడికి నిరసనగా అన్ని ఉద్యోగుల సంఘాలు, పెద్దపల్లి కలెక్టరేట్ ఆవరణలో నిరసన కార్యక్రమము చేపట్టారు. జిల్లా కలెక్టర్, శ్రీ కోయ శ్రీహర్షకు వినతి పత్రం సమర్పించినారు. ఈ సందర్భంగా ఉద్యోగుల జేఏసీ చైర్మన్, సెక్రటరీ జనరల్ శంకర్ తూము రవీందర్ పటేల్ మాట్లాడుతూ.. అధికారులపై దాడులు చేసినా, అక్రమంగా కేసులు నమోదు చేసినా సహించేది లేదని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల, అధికారులు కార్యాచరణ కమిటీ ఆదేశముల క్రమము పెద్దపెల్లి జిల్లాలో అన్ని ఉద్యోగుల సంఘాల, ఉద్యోగుల సహకారముతో అందరిని కలుపుకొని పోయి ఉద్యోగుల హక్కులను కాపాడుకుంటామని ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ప్రజలకు సేవచేయుటయే ఉద్యోగుల, అధికారుల ధ్యేయమన్నారు.
ప్రభుత్వ ఆదేశాలు అమలు పరచుటకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని తెలిపారు. దాడులు ఇలాగే కొనసాగిస్తే 206 ఉద్యోగుల, అధికారుల సంఘాల ఐకమత్యంతో ఉన్నాయని, గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అధికారులు, ఉద్యోగులు ఎంతో శ్రమకు ఓర్చి ఎన్నో సందర్భాలలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇటు ప్రభుత్వమును అధికారులకు, ప్రజలను సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారం చేస్తున్నారని, ఇటువంటి దాడులను మరొకసారి చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమములో టీజీవో, టీఎన్జీవో వివిధ సంఘముల నాయకులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.