calender_icon.png 31 January, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాల్లో ఉగ్ర కదలికల కలకలం

31-01-2025 12:29:36 AM

  1. చిరువ్యాపారాల ముసుగులో ఉగ్రముకలు
  2. దేశంలో ఎక్కడ పట్టుబడిన మూలాలు తెలంగాణలోనే

నిజామాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): తెలంగాణ జిల్లాల్లో ఉగ్ర కదలికలు కలకలం రేపుతున్నాయి. దేశంలో ఉగ్రమూకలు ఎక్కడ పట్టుబడిన వారి మూలాలు ముఖ్యంగా నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఉంటున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉగ్రముక  స్థానికుల్లో కలిసిపోయి తమ కార్య  లను విస్తరిస్తున్నారు.

భారత ప్రభుత్వం నిషేధించిన పీఎఫ్‌ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) యువతను ఉగ్రవాదం వైపు మళ్లించి వారికి ఆయుధ శిక్షణ ఇస్తోంది. ఈ నిషేధిత సంస్థ తన కార్యకలపాల నిర్వహణకు నిజామాబాద్ జిల్లాను స్థావరంగా ఎం  నిజామాబాద్ పీఎఫ్‌ఐ కేసులో నిందితుడైన షేక్ ఇలియాస్ సూర్ కనిపించకుండా పోయి తాజాగా మంగళవారం నాం  కోర్టులో లొంగిపోయాడు.

నాంపల్లి కోర్టు అతడికి 15 రోజుల రిమాండ్ విధించింది. ఇదిలా ఉండగా వరంగల్ నగరానికి చెందిన జక్రియా అనే వ్యక్తికి పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్న  గుర్తించిన నిఘావర్గాలు గత ఐదు రోజుల కింద ఈనెల 25న అదుపులోకి తీసుకున్నాయి. అతడు శ్రీలంకకు వెళ్తుండగా చెన్నె ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు.

వరంగల్ శివనగర్ అండర్ బ్రిడ్జి వద్ద జక్రియా కొంతకాలంగా రాయల్ బావర్చి పేరుతో బిర్యానీ సెంటర్ నడుపుతున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. నిజామాబాద్ ఉగ్రవాద కేసును ఛేదించిన ఎన్‌ఐఏ పీఎఫ్‌ఐలోని సభ్యులకు ఆయుధ శిక్షణ ఇచ్చే సభ్యుడ్ని అరెస్ట్ చేసింది. తెలంగాణ పోలీసులు గతేడాది జూలై 4న ఈ కేసులో ఎఫ్  నమోదు చేశారు.

తర్వాత ఈ కేసును ఎన్‌ఐఏ చేపట్టింది. ఈ కేసులో ఎన్‌ఐఏ ఇప్పటివరకు 16 మంది నిందితులపై రెండు చార్జిషీట్లను దాఖలు చేసింది. నిజామాబాద్ పీఎఫ్‌ఐ కేసులో ఉగ్రముక సభ్యు  కడప జిల్లాలోని మైదాకూరులో అరెస్ట్ చేసినట్లు ఎన్‌ఐఏ అధికారులు ప్రకటించారు. నిందితుడిని అబ్దుల్ సలీంగా గుర్తించారు.

ఇతడు ముస్లిం యువతను పీఎఫ్‌ఐలో చేర్చి, ప్రత్యేక తరగతులు నిర్వహించి  వారి బ్రెయిన్ వాష్‌చేసి యువకులను ఉగ్రవాదుల శిబిరాలకు పంపినట్టు ఎన్‌ఐఏ గుర్తించింది. 2022, డిసెంబర్‌లో ఈ కేసు చార్జీల షీట్‌లో పేర్కొన్న 11 మందిలో సలీం ఒక్కడు.

చాపకింద నీరులా..

నిజామాబాద్ జిల్లాలో పీఎఫ్‌ఐ నెట్‌వర్క్ చాపకింద నీరులా వ్యాపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెం  కింద కరీంనగర్‌కు చెందిన మహ్మద్ ఇర్ఫాన్, జగిత్యాలకు చెందిన అబ్దుల్ సలీం అనే ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. వీరి ఇండ్లల్లో తనిఖీలు నిర్వహించి ముఖ్యమైన పత్రాలను, డైరీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు గురువారం కరీంనగర్‌లోని మూడో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పొనస్పురలోని ఉగ్రవాద సంస్థ పాపులర్ ప్రంట్ ఆఫ్ ఇండియా పీఎఫ్‌ఐతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఎదు  సప్రిజ్‌ఖాన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అతడు పోలీసుల ముందు నుంచి తప్పించుకున్నాడు.

గత ఆరు నెలల నుంచి పీఎఫ్‌ఐలో యువతను నియమించికొని ఉగ్రవాద కార్యకలాపాలకు శిక్షణ ఇస్తున్నాడన్న సమాచారంతో కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల తదితర ప్రదేశాల్లో ఎన్‌ఐఏ మూడుసార్లు శోధన నిర్వహించింది. నిజామాబాద్ ఉగ్రవాద కుట్ర కేసులో పీఎఫ్‌ఐకి చెందిన ఆయుధాల శిక్షణలో ఆరి  నంద్యాలకు చెందిన మహమ్మద్ యూనూస్ కోసం ఎన్‌ఐఏ వేట ప్రారంభించింది.

మహమ్మద్ యూనాస్ కర్ణాటకలో తలదాచుకున్నట్లు కేంద్ర నిఘా సంస్థలు గుర్తించినట్లు సమాచారం. తాజాగా అహ్మ  ఇలియాసీ నాంపల్లి కోర్టులో లొంగిపోవడంపై భద్రతా సంస్థలు పీఎఫ్‌ఐ క్లిపర్ కాల్ నెట్‌వర్క్‌లపై ఎన్‌ఐఏ తమ దర్యాప్తును తీవ్రతరం చేయనున్నట్లు తెలుస్తోంది.