జాన్‌పీర్‌కు చెందిన వ్యక్తి తమిళనాడులో అరెస్టు
మహబూబాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): ఓరుగల్లులో ఉగ్ర కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వరంగల్ నగరానికి చెందిన వ్యక్తికి పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పుమన్నాయి. వరంగల్ జాన్‌పీర్‌కు చెందిన జక్రియాకు పాకిస్తాన్ ఉగ్రవాదులతో సం బంధాలు ఉన్నాయని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.
ఈ నెల 25న శ్రీలంకకు వెళ్తుండగా జక్రియాను చెన్నై ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమచారం. వరంగల్ శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద జక్రియా కొంత కాలంగా రాయల్ బావర్చి పేరుతో బిర్యానీ సెంటర్ నడుపుతున్నట్లు తెలుస్తున్నది.
అతనికి కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నది. అత ని వద్ద పాక్ ఉగ్రవాద సంస్థకు చెందిన కరపత్రాలు, ఫొటోలు లభించినట్లు సమాచారం.