calender_icon.png 12 January, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప ఎన్నికల్లో హింస

11-07-2024 01:49:20 AM

దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ సెగ్మెంట్లకు బైపోల్

న్యూఢిల్లీ, జూలై 10: దేశవ్యాప్తంగా బుధవారం నిర్వహించిన 13 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో పలుచోట్ల హింస చెలరేగింది. బీహార్‌లోని రూపౌలీ అసెంబ్లీ స్థానంలో పోలింగ్ సందర్భంగా ఘర్షణ జరగడంతో నలుగురు గాయపడ్డా రు. ఇందులో ఓ పోలీస్ అధికారి కూడా ఉన్నారు. బెంగాల్‌లోని రాయ్‌గంజ్, ర ణఘాట్ దక్షిణ్, బాగ్దాహ్, మనిక్తల్, తమిళనాడులోని విక్రవండి, మధ్యప్రదేశ్‌లోని అమర్వారా, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, మంగ్లౌర్, పంజాబ్‌లోని జలం ధర్, హిమాచల్ ప్రదేశ్‌లోని డెహ్రా, హమీర్పూర్, నలగర్ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు.