న్యూఢిల్లీ, జనవరి 4: మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. కాంగ్‌పోక్పీలో డిప్యూటీ కమిషనర్ ఆఫీస్‌పై కుకీ తెగకు చెందిన ఆందోళనకారులు దాడిచేశారు. ఈ ఘటనలో ఎస్పీ సహా పలువురు సిబ్బందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో అక్రమ బంకర్లను కూల్చివేసేందుకు భద్రతాదళాలు ఇటీవల భారీ ఆపరేషన్ చేపట్టాయి. వీటిని వ్యతిరేకిస్తూ స్థానికంగా పలు గ్రామాల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ఈ ఆందోళనల్లో పాల్గొన్న కొందరు మహిళలపై భద్రతా దళాలు లాఠీచార్జి చేశారు. కేంద్ర బలగాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుకీలు, వారిని వెనక్కి పంపించాలని డిమాండ్ చేశారు. తెగల మధ్య ఆధిపత్యం కోసం 2023, మే నుంచి కొనసాగుతున్న హింసాత్మక ఘటనల్లో దాదాపు 200 మంది చనిపోగా, వేలాది మంది గాయాలపాలయ్యారు. హింసకు ముగింపు పలకం డని సీఎం ఎన్ బీరెన్‌సింగ్ పిలుపునిచ్చారు.