calender_icon.png 18 October, 2024 | 3:52 PM

మహిళలపై హింసను అరికట్టాలి

18-10-2024 02:44:07 AM

ఎస్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సదాలక్ష్మి

కరీంనగర్ సిటీ, అక్టోబరు 17: దేశంలోని మహిళలందరికీ అన్నిరంగాల్లో అవకాశాలు కల్పించాలని పాలక ప్రభుత్వాలను.. భారత జాతీయ మహిళా సమాఖ్య(ఎస్‌ఎఫ్‌ఐడ బ్ల్యూ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.సదా లక్ష్మికోరారు. కరీంనగర్‌లోని బద్ధం ఎల్లారెడ్డి భవన్‌లో గురువారం భారతీయ జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సదాలక్ష్మి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మహిళలపై అ ఘాయిత్యాలు, అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, మహిళలు అనేక రకాలుగా హింసించబడుతున్నారని, బాధిత మ హిళల రక్షణ కోసం ఉన్న చట్టాలను పక్కాగా అమలు చేయడంతో పాటు మరిన్ని కఠినమైన చట్టాలు చేయాలని ప్రభుత్వాలను కో రారు. అలాగే మరిన్ని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏ ర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చట్ట స భల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ప్రాతినిధ్యం ఉండేలా చట్టం చేయాలని డి మాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు కిన్నెర మల్లవ్వ, నాయకురాళ్లు.. భారతి, జి.శారద, రాజేశ్వరి, స్వప్న, మంజుల, లక్ష్మి, స్వరూప, అరుణ తదితరులు పాల్గొన్నారు.