28-02-2025 12:00:00 AM
గురువును దైవంగా భావించే సమాజం మనది. వారికి తల్లిదండ్రులతో సమాన స్థాయి కల్పించారు. కానీ, ఇప్పుడు ఉపాధ్యాయుల పట్ల పాఠశాల స్థాయిలో విద్యార్థులు హింసాత్మక చర్యలకు దిగుతున్న సంఘటనలు చూస్తున్నాం. 2024లో జరిగిన ఒక సర్వే ప్రకారం 71 శాతం టీచర్లు విద్యార్థుల నుంచి ఏదో ఒక రకమైన హింసను ఎదుర్కుంటున్నారని తేలింది. 44 శాతం బోధకులు విద్యార్థుల నుం చి దూషణలు, బెదిరింపులు ఎదుర్కునగా, 29 శాతం సంఘటనలలో విద్యా ర్థులు గురువుల విలువైన వస్తువులు, వాహనాలు ధ్వంసం చేశారు.
14 శాతం ఉపాధ్యాయులు విద్యార్థులద్వారా భౌ తికదాడులు ఎదుర్కొన్నారు. విద్యార్థులు పలు కారణాలవల్ల ఘర్షణాత్మక వైఖరిని పెంచుకుంటారు. వ్యక్తిగత స మస్యలు, ఉద్వేగ నియంత్రణ లేకపోవడం, ఇతర విద్యార్థులతో వేధింపులు, సమూహ ప్రభావం, కుటుంబ సమస్యలు, పరీక్షల ఒత్తిడి, ఉపాధ్యాయుల తో పదేపదే దండన, ఛీత్కారాలు ఎదుర్కోవడం, క్రమశిక్షణ లోపించడం, మ త్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం వంటివి ప్రధాన కారణా లుగా భావించవచ్చు. వీటిద్వారా ఉద్రేకానికి గురైన విద్యార్థులు బోధకులపై దాడులకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉంటున్నది. విద్యార్థులను క్రమశిక్షణగా ఉంచాలనే ప్రయత్నించే ఉపాధ్యాయులపైనా దాడులు ఎక్కువగానే జరుగుతున్నాయి.
సుహృద్భావ వాతావరణం
ఘర్షణ పడుతున్న విద్యార్థులను ఆపే ప్రయత్నంలో విద్యార్థులు దాడి చేయగా ప్రాణాలు కోల్పోయిన సంఘటన అనంతపురం జిల్లా రాయచోటిలో 2024 డిసెంబర్‌లో జరిగింది. విద్యార్థుల యూనిఫాం, హెయిర్ స్టైల్, ప్రవ ర్తన, భాష, వేషధారణ, హోమ్‌వర్క్ విషయాలలో కఠినంగా వ్యవహరించే టీచర్లపట్ల విద్యార్థులు ద్వేషం పెంచుకుని ఘర్షణలకు దిగుతున్నారు.
వారి ద్వేషాన్ని గోడలపై రాతలు, వ్యక్తిగత దూషణలు, వస్తువులు, వాహనాలకు నష్టం కలిగించడం, బెదిరింపులు, సోషల్ మీడియా పోస్టులతో వెళ్లగక్కడంతోపాటు భౌతికదాడులకు తెగబడు తున్నారు. గురువును దైవంగా భావిం చే దేశంలో ఇలాంటి సంఘటనలు జరుగడం శోచనీయం.
విద్యార్థులలో ఉత్పన్నమయ్యే సమస్యాత్మక ఉద్వేగాలను మొదట్లోనే ని యంత్రించాలి. ‘మొక్కై వంగనిది మానై వంగదు’. పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు విద్యార్థుల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. తరగతి గదిలో పిల్లలు తమ అభిప్రాయాలు వెలువరించేందుకు తగిన స్వే చ్ఛ ఇవ్వాలి.
గురుశిష్యుల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు నెలకొల్పాలి. ఘర్షణాత్మక ప్రవర్తనను నియంత్రించేలా అధ్యాపకులకు శిక్షణ ఇవ్వాలి. పాఠశాలలో విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించాలి. తల్లిదండ్రుల సహకారమూ అవసరం. ఇరువురి మధ్య సు హృద్భావ వాతావరణానికి అందరూ ప్రయత్నించాలి.
- డా. అనుమాండ్ల వేణుగోపాలరెడ్డి