ఢాకా, నవంబర్ 7: బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసాకాండ కొనసాగుతోంది. చిట్టగాంగ్‌లో హిందువుల ను టార్గెట్ చేసుకుని భద్రతాదళాలు చావగొట్టాయి. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇస్కాన్, హిందూ వ్యతిరేక పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తాజా పరిణామం చో టు చేసుకుంది. రాడికల్ ఇస్లామిక్ గ్రూపైన జమాతే ఇస్లామి సంస్థకు చెందిన ఉస్మాన్ అలీ నవంబర్ 5న హిందువులకు వ్యతిరేకంగా ఇస్కాన్‌ను కించపరుస్తూ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్‌పై హిందూ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.