12-02-2025 01:19:26 AM
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి) : కొందరు అధికారులు నిబంధనలు కాగితాలకే పరిమితం చేస్తుండ్రు. చట్టాలు ఎలా ఉన్నా అవి మాకు అనుకూలంగానే ఉంటాయంటూ ప్రభుత్వ నిబంధనలకు తూ ట్లు పొడుస్తుండ్రు. 2001 సంవత్సరంలో జడ్చర్ల సమీపంలో పోలేపల్లి సెజ్ ఏర్పాటు నిమిత్తం దాదాపు 1000 ఎకరాల భూమి ప్రభుత్వము వివిధ కంపెనీలకు అప్పజెప్ప డం జరిగింది.
రైతుల నుంచి తీసుకున్న ఈ భూమి కి పరిహారంగా రైతులకు అప్పటి ప్రభుత్వ నిర్వాసితులకు ఒక్కొక్కరికి 200 గజాల ప్లాట్ ను ఇవ్వడం జరిగింది. ఈ ప్లాటు ప్రభుత్వ అనుమతులు లేకుండా విక్ర యాలు... అత్యధిక నిర్మాణాలు.. చేపట్టకూడ దని ధ్రువీకరణ పత్రంలో పలు నిబంధన లను పొందిపరిచింది.
కాగా అధికారులు మాత్రం పంచాయతీ కార్యదర్శి నుంచి సబ్ రిజిస్టర్ వరకు ఈ భూములను ఎలా రిజి స్ట్రేషన్ చేయాలో జర్ర ప్రత్యేక ఆలోచన చేసి రిజిస్ట్రేషన్ చేసిండ్రు. ఇండ్లు లేకున్నా ఇండ్లు ఉన్నట్టు సృష్టించి ఇంటి నెంబర్లు వేసి విక్ర యానికి రాని ప్లాట్‌లకు ప్రత్యేక ఇంటి నెంబ ర్లు వేసి ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని పోలే పల్లి గ్రామస్తులు సీఎం ప్రజావాణి కి ఫిర్యా దు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయిలో పత్రాలను వారు సీఎం ప్రజావా ణికి అందించిండ్రు.
అనుకుంటే సాధ్యం కానిదేంది
చాలామంది మహనీయులు మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని చెబు తుంటారు.. ఇక్కడ కొంతమంది అధికారులు ఈ మాటను అక్రమాలు చేసేందుకు ఉప యోగిస్తున్నట్లు ఉన్నారు. మనిషి ఎదుగుద లకు ఎలా ఆయన శ్రమించి ఉన్నత శిఖరా లకు ఎదగాలి తప్ప అక్రమాలు చేసేందుకు వాటిని ప్రోత్సహించేందుకు ఎంతటి శ్రమ అయినా తీసుకోకూడదు అనే విషయాన్ని పెద్దలు చెప్పిన మాట పక్కన పెడుతున్నారు.
చట్టం చెబుతున్న వాటిని పట్టించుకోవడం మానేసింది. మనం అనుకుంటే కానిది ఏ ముంది అన్నట్టుగా కొంతమంది మధ్యవర్తు లతో కలిసి పోలేపల్లి గ్రామంలోని నిర్వాసి తులకు అందించిన ప్లాట్లకు పురాతన ఇంటి నెంబర్లు వేసి ధ్రువీకరణ పత్రాలు సృష్టించి విక్రయానికి రాని ప్లాట్లను విక్రయించి.. రిజిస్ట్రేషన్లు చేసిన చేయించారు.
అధికారులు పక్కాగా ఇది జరగదు .. ప్రభుత్వ భూమి రిజి స్ట్రేషన్ ఎలా చేస్తారు ? అని మొదట్లోనే ఆపితే ఈ ప్రక్రియ ఎక్కడ కూడా జరగదు. కొంతమంది అధికారులు ఎంతటి కష్టమైనా ఓు్ంచకుని అక్రమ పనులను సక్రమంగా చేసేందుకు తెగ ప్రత్యేకత ఇస్తారు.
పోలేపల్లి సిద్దులు ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లు 11 ప్లాట్లు అక్రమంగా రిజిస్ట్రేషన్ అయినట్లు పోలేపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎంత ప్రత్యేకత చూయించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించా ల్సిన అవసరం చేయవలసిన అవసరం అధి కారులకు ఏముందో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తప్పుచేసి బదిలీ అయితే సరిపోతుందా?
అధికారులు ఒకచోట పని చేసి అక్కడ లెక్కకు మించి తప్పులు చేసి ఇతర ప్రాంతా నికి బదిలీ అయితే సరిపోతుందా అంటూ కొంతమంది ప్రజలు అసహనం వ్యక్తం చే స్తుండ్రు. చాలా ప్రాంతాలలో అధికారుల పై ఆరోపణలు వచ్చిన వెంటనే అధికారిని బది లీ చేసి నూతన అధికారులు తీసుకువచ్చి ఆరోపణలకు ముగింపు పెట్టడం ఎంతవరకు సమంజసం ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అధికా రి విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఏ ప్రాంతం లో విధులు నిర్వహించిన అక్కడ తప్పిదాలు అతని హయాంలో జరిగితే వారే పూర్తి బాధ్యత వహించేలా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నా రు. పోలేపల్లి లో నిర్వాసితులకు అందించిన ఈ ప్లాట్ల విషయంలో అక్రమ రిజిస్ట్రేషన్లు ఎందుకు సహకరించిన పంచాయతీ కార్యద ర్శిపై చర్యలు తీసుకోవాలని పోలేపల్లి గ్రామస్తులు కోరుతుండ్రు. ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుం టారో అనే సందేహం నెలకొంది.