calender_icon.png 10 January, 2025 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడుగడుగునా ఉల్లంఘనలు

31-12-2024 02:37:44 AM

  • పసుమాములలోని ఆల్ రిచ్ డెయిరీపై ఫుడ్‌సేఫ్టీ అధికారుల దాడులు
  • అపరిశుభ్ర వాతావరణంలో పాలు, పాల ఉత్పత్తులు తయారుచేస్తున్నట్లగా గుర్తింపు
  • పాలు, నెయ్యి శాంపిల్స్ సేకరణ
  • పరిశ్రమ సీజ్

అబ్దుల్లాపూర్‌మెట్, డిసెంబర్ 30: రంగారెడ్డి జిల్లాలోని ఆల్ రిచ్ డెయిరీపై రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వీ జ్యోతిర్మయి ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పి. రోహిత్ రెడ్డి, పి. స్వాతి, జగన్నాథ్, శివశంకర్‌రెడ్డితో కూడిన బృందం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని పసుమాముల గ్రామంలోని ఆల్ రిచ్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ (శ్వేత బ్రాండ్ పాలు, పెరుగు) పాలు, పాల ఉత్పత్తుల తయారీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. పాల తయారీలో చాలావరకు ప్రభుత్వ ఉల్లంఘనలు జరిగినట్ల్లు గుర్తింన అధికాలు సంబంధిత పాలకేంద్రాన్ని సీజ్ చేశారు.

అపరిశుభ్ర వాతావరణంలో పాల తయారీ..

ఎప్‌ఎస్‌ఎస్‌ఐ లైసెన్స్ ఆల్ రిచ్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ (శ్వేత బ్రాండ్ పాలు, పెరుగు) అనే పేరుతో వ్యాపారం చేస్తూ బ్రాండ్‌పై లైసెన్స్ విషయంలో స్పష్టత లేకుండా విక్రయాలు చేయడం, ఫ్లేవర్డ్ మిల్క్ లాంటి పదార్థాలను లైసెన్స్ క్యాటగిరిలో చేర్చకుండా తయారు చేసి నిల్వ ఉంచివిక్రయించడం, పూర్తిగా అపరిశుభ్రత వాతావరణంలో పాలు, పాల ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. పాలు, నెయ్యి, శాంపిల్‌లను సేకరించి ల్యాబ్‌కి పంపించారు. నిబంధనలు పాటించని, అనుమతులు లేని కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యాపారాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ టీం హెడ్ వీ జ్యోతిర్మయి స్పష్టం చేశారు.