calender_icon.png 21 September, 2024 | 8:36 AM

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే జైలు జీవితం తప్పదు.!

26-07-2024 12:55:35 PM

వాహనదారులకు జిల్లా ఎస్పీ హెచ్చరిక

రోడ్డు ప్రమాదాల్లోనే అత్యధిక మరణాలు

జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్

నాగర్ కర్నూల్, విజయక్రాంతి: ప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ రూల్స్ లను అతిక్రమించిన వారికి జైలు జీవితం తప్పదని జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్రగ్నాథ్ వాహనదారులను హెచ్చరించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కార్యాలయాన్ని డిఎస్పి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వాహనదారుల ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు జిల్లాలో ఇప్పటివరకు 33 హత్యలు జరిగి మరణిస్తే 175 మంది కేవలం మద్యం తాగి అధిక వేగంతో వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదంలో మరణించారని గుర్తు చేశారు.

వాటిని నిలువరించడం కోసమే జిల్లాలో ట్రాఫిక్ రూల్స్ పాటించేలా నూతన స్టేషన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కల్వకుర్తి-శ్రీశైలం, కల్వకుర్తి-కొల్లాపూర్ రోడ్డు నిర్మాణ సమయంలో కూడా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదంలో వాహనాన్ని తగిలించి పారిపోతే అత్యధిక కఠినంగా శిక్షలు ఉన్నాయని హెచ్చరించారు. తాగి వాహన నడిపిన వాహనదారులు ప్రభుత్వ అధికారిపై చేయి చేసుకుంటే జైలుకెళ్ళడం ఖాయమన్నారు. జిల్లా కేంద్రంలోని దుకాణదారులు రోడ్డు స్థలాన్ని ఆక్రమిస్తే చర్యలు ఉంటాయన్నారు. ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ నిర్వాహకుల సైతం భారీ వాహనాలను రోడ్డుపై అడ్డంగా నిలపడం సరికాదని హెచ్చరించారు. మహారాష్ట్రలో ఓ మైనర్ డ్రైవింగ్ ఆక్సిడెంట్ వల్ల సహకరించిన అధికారులు, కుటుంబంలోని సభ్యులంతా జైలు జీవితం అనుభవించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. వారితోపాటు ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్, సిఐ కనకయ్య ఎస్సై గోవర్ధన్ తదితరులున్నారు.