ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి
ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి
జగిత్యాల (విజయక్రాంతి): శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా ధర్మపురి సీఐ రాం నర్సింహారెడ్డి అన్నారు. గురువారం బుగ్గారం మండలంలోని గోపులాపూర్ గ్రామంలో బతుకమ్మ, దసరా పండుగలను శాంతియుత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని గ్రామస్తులతో శాంతి సమావేశాన్ని బుగ్గారం ఎస్సై మాడ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా ధర్మపురి సీఐ రాం నర్సింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థుల ఉద్దేశించి ధర్మపురి సిఐ మాట్లాడుతూ.. దసరా, బతుకమ్మ పండుగల పర్వదినం సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగీస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. స్నేహపూర్వక వాతావరణంలో ప్రజలు కలిసి మెలిసి ఉండాలని సీఐ సూచించారు.
సర్కిల్ పరిధిలోని ప్రజలకు సీఐ ముందుగా "దసరా" శుభాకాంక్షలు తెలిపారు. బుగ్గారం ఎస్సై శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. పొలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరిగిన ఉపేక్షించేది లేదన్నారు. అపరిచిత వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏవైనా సమస్యలుంటే పోలీసు స్టేషన్ కు వచ్చి తనను నేరుగా కలువవచ్చని పేర్కొన్నారు. విజయదశమి పండుగను ప్రజలంతా శాంతియుత వాతావరణంలో జరుపుకోవా లని శ్రీధర్ రెడ్డి పిలుపు నిచ్చారు.