calender_icon.png 25 March, 2025 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ్ అవార్డు

23-03-2025 12:38:19 AM

జ్ఞానపీఠ్ అందుకోనున్న 12వ హిందీ రచయిత

న్యూఢిల్లీ, మార్చి 22: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రఖ్యాత హిందీ రచయిత వినోద్‌కుమార్ శుక్లాను 59వ జ్ఞానపీఠ్ అవార్డు వరించింది. సాహిత్య రంగంలో దేశంలోనే అత్యున్నత పురస్కారం ఈ జ్ఞానపీఠ్ అవార్డు. జనవరి 1 1947న ఛత్తీస్‌గఢ్‌లోని రాజనందగావ్‌లో ఆయన జన్మించిన వినోద్ కుమార్ శుక్లాకు ఈ ఏడు జ్ఞానపీఠ్ అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించారు.

గత 50 ఏండ్లుగా ఆయన రచనలు చేస్తున్నారు. ఆయన మొదటి పద్య సంకలనం ‘లభాగ్ జై హింద్’ 1971లో ప్రచురితమైంది. వినోద్‌కుమార్ నవలలైన ‘నౌకర్ కీ కమీజ్’, ఖిలేగా తో దేఖేంగే’, ‘దీవార్ మెయిన్ ఏక్ ఖిడ్కీ’ లను ఉత్తమ హిందీ నవలలుగా పరిగణిస్తారు. అంతే కాకుండా ఆయన పలు కథలు కూడా రాశారు. ఈ అవార్డు రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఈ అవా ర్డు చాలా పెద్దదని, తన బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ వినోద్‌కుమార్‌కు అభినందనలు తెలియజేశారు. ఆయన స్పం దిస్తూ.. ‘రాష్ట్రానికి చెందిన వ్యక్తికి అవార్డు రావడం ఛత్తీస్‌గఢ్‌కు గౌరవం. ఛత్తీస్‌గఢ్ దేశ సాహితీవేదికపై  గర్వపడేలా శుక్లా చేశారు’ అని తెలిపారు.

ఈ అవార్డు కింద ఆయనకు రూ. 11 లక్షల నగదుతో పాటు సరస్వతి కాంస్య విగ్రహాన్ని అందించనున్నారు. ఈ పురస్కారం 1944లో ఏర్పాటైం ది. ఇప్పటి వరకు 11 మంది హిందీ రచయితలకు ఈ పురస్కారం లభించింది. వినోద్ కుమార్ శుక్లాకు 1999లోనే సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.