హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 5 (విజయక్రాంతి): గ్రేటర్ హైద రాబాద్ ఆర్టీసీ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)గా సి.వినోద్‌కుమార్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈడీగా పనిచేసిన వెంకటేశ్వర్లు ఆగస్టు 31న పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ హైదరాబాద్ రీజియన్ ఆర్‌ఎం వరప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ సంస్థ నిర్వహణలో పటిష్టమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉద్యోగులను, సిబ్బందిని అందరినీ కలుపుకొనిపోయి గ్రేటర్ ఆర్టీసీ సంస్థను లాభాల్లోకి తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు.