08-04-2025 12:00:00 AM
విజయక్రాంతి, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): నగరంలోని కెనరా బ్యాంక్ నిజామాబాద్ రీజినల్ ఆఫీస్ నూతన ఏజీఎం గా వినోద్ బాబు పదవి బాధ్యతలు చేపట్టారు. బ్యాంకు ఖాతాదారులకు సౌకర్యాలు కల్పించడం త్వరితగతిన సేవలు అందించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ సందర్భంగం నిజామాబాద్ రీజినల్ ఆఫీస్ నుండి డివిజనల్ ఆఫీసర్లు ప్రవీణ్ కుమార్, ప్రదీప్ వసంత్, యోగేష్ చౌరాసియ, ఆఫీస్ సిబ్బంది నూతన ఏజీఎం వినోద్ కు ఘనంగా స్వాగతం పలికారు