calender_icon.png 19 November, 2024 | 12:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాన్సర్ తో ఉన్న అమ్మ పోరాటమే నాకు స్ఫూర్తి : వినేశ్ ఫోగట్

17-08-2024 12:21:49 PM

ఒలింపిక్స్ లో పథకం రాకపోయినా ... ఆమె పోరాటం మాత్రం దేశ వాసుల మదిలో ఎప్పుడూ నిలిచి పోతుంది. వంద గ్రాములు అదిక బరువు ఉండటంతోనే వినేశ్ అనర్హతకు గురయ్యి యావత్ క్రీడాభిమానులను  నిరాశ పరిచిన విషయం తెలిసిందే..అనర్హత వేటు తర్వాత వినేశ్  ఏకంగా ఆటకే వీడ్కోలు పలికారు.

వినేశ్ తన కుటుంబం గురించి మీడియాతో పంచుకున్నారు...

చిన్న గ్రామం నుంచి ఒలింపిక్స్లో అడుగు పెట్టడం మధురానుభూతి. అసలు ఒలింపిక్స్ అంటే ఏంటో తెలిదు. పెద్ద జడతో, మొబైల్స్ తో గడిపితే చాలు అనుకునే వాళ్లం. కాగా బస్ డ్రైవర్ అయిన నాన్న మాత్రం తన కుమార్తె విమానంలో ఎగురుతుంటే కింద రోడ్డుపై తాను బస్సు నడపాలని జోకులు విసిరేవాడు. కానీ నేను ాయన కలను నిజం చేయాలనుకున్నా. ముగ్గురు కుమార్తెలలో నేనే అందరికీ ముద్దు. ఇక మొత్తం స్టోరీ ని నడిపిన గొప్ప మహిళ మా అమ్మ. మేమంతా ఉన్నతంగా జీవించాలనే  ఆకాంక్ష బలంగా ఉండేది.

ఈ క్రమంలో మా నాన్న మిమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. విమానం ఎక్కాలనే ఆలోచనలు పక్కన పెట్టేశా. కానీ నాన్న కల నన్ను వెంటాడుతూ ఉండేది. ఈ లోగా అమ్మ క్యాన్సర్ బారిన పడింది. చనిపోతానని ఎప్పుడూ చెప్పొద్దు నిరంతరం పోరాడుతూనే ఉండాలి అని చేప్పేది. అమ్మ మాటలు నా చెవుల్లో ఎప్పుడూ మార్మోగుతూ ఫలితంతో సంబంధం లేకుండా పోరాట స్ఫూర్తి నింపేవి.

ఒలింపిక్స్, అంచనాలు.. ఒత్తిడి: 

ప్యారిస్ ఒలింపిక్స్ లో అత్యుత్తమ   ప్రదర్శన చేయాలనే ఒత్తిడి, అధిక అంచనాల నుంచి భర్త సోమ్ వీర్ ఎప్పుడూ మద్దతు తెలిపేవాడు అంటూ వినేశ్ భావోద్వేగానికి గురయ్యారు. నేను నా తొలి ఒలింపిక్స్ లో పోటీపడుతున్నపుడు కూడా నా  ప్రదర్శనను ప్రభావితం చేసింది మాత్రం భర్త సోమ్ ఆయన భర్త కంటే స్నేహితుడి పాత్రలో నే నాకు దర్శనమిస్తాడు అని ఆమె చెప్పుకొచ్చారు.