calender_icon.png 18 January, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినేశ్ ఫొగాట్‌కు పసిడి

07-07-2024 12:08:50 AM

గ్రాండ్ ప్రిక్స్ ఆఫ్ స్పెయిన్

మాడ్రిడ్ : ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్ ముందు భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సత్తా చాటింది. మాడ్రిడ్ వేదికగా గ్రాండ్ ప్రిక్స్ ఆఫ్ స్పెయిన్ టోర్నీలో వినేశ్ పసిడి పతకం దక్కించుకుంది. శనివారం మహిళల 50 కేజీల విభాగం ఫైనల్లో వినేశ్ 10 మారియా టుమెరికోవా (రష్యా)ను చిత్తు చేసి స్వర్ణం చేజెక్కించుకుంది. అంతకముందు సెమీఫైనల్లో కేటీ డట్‌చాక్ (కెనడా)ను ఓడించింది. అంతకముందు తొలి రౌండ్‌లో క్యూబాకు చెందిన గుజ్‌మన్‌ను 12 ఓడించింది. రెండోరౌండ్‌లో విన్ బై ఫాల్‌లో  నెగ్గిన వినేశ్ క్వార్టర్స్‌లో కెనడాకు చెందిన మాడిసన్ పార్క్స్‌ను చిత్తు చేసింది. పారిస్ క్రీడలకు ముందు స్వర్ణంతో మెరిసిన వినేశ్ ఆత్మవిశ్వాసం తో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు పారిస్ బయల్దేరనుంది.