పారిస్: పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ లో భారత్ పతక ఆశలు గల్లంతయ్యాయి. బుధవారం జరిగిన మహిళల 50 కిలోల రెజ్లింగ్ లో వినేష్ ఫొగాట్ పై ఐవోఏ అనర్హత వేటు వేసింది. వినేష్ ఫోగాట్ నిర్ధేశిత బరువు కన్నా 100 గ్రాములు అధికంగా ఉండడంతో ఐవోఏ చర్యలు తీసుకుంది. రెజ్లింగ్ లో 50 కిలోల కన్న ఎక్కువ ఉండకూడదు, దీంతో వినేష్ 50 కిలోల కన్న 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో అనర్హత వేసిన కారణంగా పతకం పొందే అవకాశం కోల్పోయారు. రేజ్లింగ్ మహిళల 50 కిలోల విభాగంలో ఫైనల్ కు చేరిన వినేష్ ఫొగాల్ కు పలువురు ప్రముఖులు మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు.